వేద న్యూస్,వీర్నపల్లి:
వీర్నపల్లి మండలం బాబాయ్ చెరువు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి గ్రామ సర్పంచ్ మలోత్ సుధాకర్ ఆధ్వర్యంలో గురువారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ఈ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం పట్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని, ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రజలకు రాకపోకలు సులభమవుతాయని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.