వేద న్యూస్,బోయినిపల్లి :
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం, పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ చేపూరి వెంకటేష్, మరియు పాలకవర్గం గ్రామం సుభిక్షంగా, ఉండాలని ప్రత్యేక పూజలు, నిర్వహించారు.తదనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించి, ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ చేపూరి వెంకటేష్, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు మరియు గ్రామ ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం అర్చకులు సాయిరాం శర్మ, ఆధ్వర్యంలో జరిగింది.