-60 గజాల స్థలాన్ని విరాళంగా ఇచ్చిన తుళ్లూరి దంపతులు

-విరాళం విలువ రూ. 6 లక్షలు.. దాతలకు ఘన సన్మానం

వేద న్యూస్, ఖమ్మం ప్రతినిధి :

ఖమ్మం నగరం ఒకటో డివిజన్ కైకొండాయిగూడెంలోని ముత్యాలమ్మ దేవాలయ విస్తరణకు అదే డివిజన్ లో నివాసం ఉంటున్న తుళ్లూరి మాధవరావు – కోటేశ్వరి దంపతులు విరాళం అందించారు. ఆలయ అభివృద్ధి కోసం తమవంతుగా సుమారు రూ. 6 లక్షలు విలువ చేసే 60 గజాల తమ స్థలాన్ని ఆలయానికి విరాళంగా ఇస్తున్నట్లు స్థల పత్రాలను ఆదివారం ఆలయ కమిటీ సభ్యులకు అందచేసి తమ ఉదారతను చాటుకున్నారు.

తుళ్ళూరి దంపతులకు అభినందన

ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు నాగటి ఉపేందర్ మాట్లాడుతూ.. ఆలయ విస్తరణకు తమ వంతు సహాయంగా స్థలాన్ని దానం చేసిన మాధవరావు దంపతులను అభినందించారు. భక్తుల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాతలను గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్దిని ప్రసాద్, ఆళ్ల రమేష్, గద్దల చిన్నప్ప, తుళ్లూరి కృష్ణయ్య, నాగటి శ్రీనివాసరావు, శీలం వీరబాబు, గిరిశాల రామారావు, పందుల తిరుపతిరావు, భూక్యా ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.