వేదన్యూస్ మహబూబ్ నగర్

అఖిల భారత శరీర అవయదాతల సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా డాక్టర్ లయన్ అంబటి నటరాజు

సావిత్రి బాయి పూలే విద్యా చారిటబుల్ ట్రస్ట్ అనుబంధ విభమైన అఖిల భారత శరీర అవయదాతల సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా డాక్టర్ లయన్ అంబటి నటరాజు నియమితులయ్యారు. ఈ మేరకు ట్రస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ గూడూరు సీతా మహాలక్ష్మీ, మేనేజింగ్ ట్రస్టి ప్రొఫెసర్ ఆనంద్ స్వరూప్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా దానం లక్ష్యంగా అనాథ, నిరుపేద విద్యార్థుల చదువుకు చేయూత, ప్రోత్సాహం అందించడం, మరణించు, జీవించు నినాదం తో దేశ వ్యాప్తంగా శరీర దానం – అవయ దానం పై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న ఈ సంఘానికి మహబూబ్ నగర్ చెందిన సామాజిక సేవకులు, రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజును తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు గా నియమించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో నేత్ర దానం, అవయ దానాల పై ప్రజల్లో విస్తృత స్థాయి అవగాహన కల్పిస్తున్న నటరాజు సేవలను గుర్తించి రాష్ట్ర బాధ్యత లు అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా లయన్ నటరాజ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండ బాధ్యతలు నిర్వహిస్తానని అన్నారు. ఈ మేరకు తన నియమాకానికి సహకరించిన డాక్టర్ గూడూరు సీతా మహాలక్ష్మీ, ప్రొఫెసర్ ఆనంద్ స్వరూప్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *