వేదన్యూస్ ములుగు :
ములుగులో విషాదం చోటుచేసుకుంది
మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుడు సాంబయ్య విధులు నిర్వహిస్తుండగా తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బతో మృతి చెందాడు. మధ్యాహ్న సమయంలో పనులు చేస్తూ అస్వస్థతకు గురైన సాంబయ్య మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకుని షెడ్డు కింద విశ్రాంతి తీసుకున్నాడు. కొంతసేపటి తర్వాత తోటి కార్మికులు పిలిచినా లేవకపోవడంతో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.