వేదన్యూస్ వరంగల్ :
HYDలో కుర్చీ తాత మృతి
వరంగల్ శివనగర్కు చెందిన ‘కుర్చీ తాత’ (షేక్ అహ్మద్ పాషా) HYDలో కన్నుమూశారు. SM ద్వారా ఎంతో ప్రజాదరణ పొందిన ఆయన ఎండల తీవ్రత కారణంగా బుధవారం కృష్ణకాంత్ పార్క్ వద్ద అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఇంటికి తరలించగా, తన భార్య ఒడిలో తలపెట్టి ఆయన తుది శ్వాస విడిచారు. గతంలో ఆయన మరణించినట్లు వచ్చిన పుకార్లు అబద్ధమని తేలినా.. ఆయన నిజంగానే లోకాన్ని విడిచి వెళ్లారు.