వేదన్యూస్ వరంగల్
కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. జీవో 87 రద్దు చేసి కానిస్టేబుల్ వయోపరిమితిని 34 లేదా 36 ఏళ్లకు పెంచాలని కోరారు. పోలీస్ శాఖలో 20 వేల ఖాళీలు ఉన్నా, నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.