వేదన్యూస్ తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. అలాగే పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లోనూ విద్యార్థులకు ఉదయం బ్రేక్ఫాస్ట్, పాలు అందించాలనీ నిర్ణయించింది. ఇది రానున్న విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.