వేదన్యూస్ తెలంగాణ

బక్రీద్‌ పండుగ మే 27 వ తేదీన జరగాల్సిన పండుగను మే 28వ తేదీకి తెలంగాణ ప్రభుత్వం మార్చడంతో..

మే 28న జరగాల్సిన ఎన్విరాన్మెంట్ స్టడీస్ పరీక్షను మే 29కి ఇంటర్ బోర్డు మార్చింది.

ఈ విషయాన్ని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని ఇంటర్ బోర్డ్ విజ్ఞప్తి చేసింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో ఫెయిలైన వారికి, తక్కువ మార్కులు వచ్చి ఇంప్రూవ్మెంట్ రాసుకోవాలనుకునే విద్యార్థుల కోసం బోర్డు ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది. ఈ ఏడాది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3,98,358 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. దీంట్లో జనరల్ విభాగంలో మొత్తం 3,69,294 మంది, ఒకేషనల్ విభాగంలో 28,703 మంది విద్యార్థులు పరీక్షలకు అటెండ్ కానున్నారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 2,67,141 మంది ఉండగా, సెకండియర్ నుంచి 1,30,856 మంది విద్యార్థులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *