వేదన్యూస్
పీఎం కిసాన్ 23వ విడత అప్డేట్.. రైతుల ఖాతాల్లోకి రూ.2000 వచ్చేది అప్పుడే?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత కోసం దేశవ్యాప్తంగా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మూడు విడతల్లో రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తుండగా, ఇప్పటివరకు 22 విడతల నిధులు విడుదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం 23వ విడత రూ.2,000 జూన్-జులై మధ్యలో రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ-కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈ నిధులు అందనున్నాయి. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆధార్ ఓటీపీ సాయంతో రైతులు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.