టీచర్స్ కాలనీ ఫేజ్ -2లో డ్రైనేజ్ సమస్యలను వెంటనె పరిష్కరించాలని డిమాండ్
హనుమకొండ వడ్డేపల్లి టీచర్స్ కాలనీ ఫేజ్-2లో డ్రైనేజీ సమస్య తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రిటైర్డ్ టీచర్ కందుకూరి దేవదాసు ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో కాలనీవాసులు డ్రైనేజీ నీటిని వదిలేయడంతో నెలలుగా నీరు నిల్వ ఉండి గుంతలు ఏర్పడ్డాయి. దుర్వాసన, దోమల పెరుగుదలతో చిన్నపిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన తెలిపారు. వెంటనే డ్రైనేజీ ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని మున్సిపల్ అధికారులను కోరారు.