వేదన్యూస్ వరంగల్
వరంగల్ కొత్తవాడ ప్రాంతానికి చెందిన దివ్య-జాయ్ తంబిరాజ్ దంపతుల కుమార్తె జోనిసా ఎస్తేర్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు సంపాదించుకుంది. కీబోర్డ్ ప్రతిభ పోటీల్లో పాల్గొని గంట పాటు నిరంతరాయంగా వాయిస్తూ రికార్డ్ సృష్టించారు. ఈ పోటీల్లో వివిధ దేశాల నుంచి 2 వేల మంది వాయిద్య కారులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ చూపిన 777 మందికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు లభించింది.