వరంగల్ వేదన్యూస్ :
వరంగల్ జిల్లా డ్రైవింగ్ స్కూల్ యూనియన్ నూతన కమిటీ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా వరంగల్ ఆర్టిఏ రంగరావును మర్యాద పూర్వకంగా కలసి వారిని వరంగల్ జిల్లా డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరం విజయ్, ఉపాధ్యక్షుడు ఎండి ఇక్బాల్ అహ్మద్ లు పూల బుకే ఇచ్చి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు ఎర్ర సతీష్ , శేఖర్, కుమారస్వామి, సునీల్, డీకే శేఖర్, మదీనా పాషా, గణేష్, నరేష్ తదితరులు పాల్గోన్నారు.
