వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి :
వరంగల్ జిల్లాలోని సీకేఎం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నిర్వహించిన నీట్–2026 (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు మొత్తం 480 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 431 మంది విద్యార్థులు హాజరయ్యారని, 49 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ పరీక్షను పారదర్శకంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో పరీక్ష విజయవంతంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
