వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : 

హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి ఎస్‌బీహెచ్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళ మెడలోని సుమారు మూడు తులాల బంగారు గొలుసును ఇద్దరు గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి అపహరించి పరారయ్యారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సుబేదారి ఇన్‌స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ తెలిపారు.