వేద న్యూస్, వరంగల్ టౌన్ :
వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పిలుపుమేరకు చాత్రోంకి గూంజ్ కార్యక్రమం చేపట్టారు.దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఏ పరీక్షలు చేపట్టిన పేపర్ లీక్ ల ద్వారా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం యొక్క విధివిధానాలపై వ్యతిరేకిస్తూ నీట్ ఎగ్జామ్ పేపర్ లింక్ పై ఎంతోమంది విద్యార్థుల జీవితాలను అందాకారంలోకి నెట్టేసిన కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాను రాజీనామా చేయాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ అయుబ్ డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న నరేంద్ర మోడీ, అమిత్ షాలు వెంటనే రాజీనామా చేసి ప్రజలకు బేషరత్తుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని యువజన విభాగ అధ్యక్షులు కొరివి పరమేష్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నల్లగొండ రమేష్, గుండేటి నరేందర్, కరాటే ప్రభాకర్,గజ్జల లింగమూర్తి, జాను, రవి, మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు.

