• మండల తహసీల్దార్ కార్యాలయంలో ముసలం..
  •  నువ్వా నేనా అనే చందంగా మారిన అధికారుల తీరు..
  • అధికారి పై చలాయిస్తున్న ఆధిపత్య పోరు..

 

వేద న్యూస్, రుద్రూర్ :

రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నువ్వా.. నేనా అన్న చందంగా మారింది ఓ అధికారి తీరు. తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి, పక్షపాతం లేదా అధికారుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా పరిపాలన ‘నువ్వా నేనా’ అన్నట్లుగా మారడం సర్వసాధారణంగా మారింది.

రాజకీయ జోక్యం, సిబ్బంది కొరత, పారదర్శకత లోపించడం వల్ల సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఓ రెవెన్యూ అధికారి హోదాలో ఉండి కూడా ఓ రాజకీయ నాయకుడికి సపోర్ట్ చేస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆ రాజకీయ నాయకునిది ఏదైనా పని ఉంటే సాధారణ వారి పనులను పక్కన పెట్టి ఆ నాయకుని పనులు మాత్రమే చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఆ రెవెన్యూ అధికారి పని తీరుపై పలుమార్లు ఆరోపణలు వెలువెత్తాయి.

అయినా కూడా ఆ అధికారి తీరు మార్చుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఓ అధికారిని మరో అధికారి పై ఆధిపత్యపోరు చలాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీంతో తహసిల్దార్ కార్యాలయంలో సాధారణ వ్యక్తుల పనులు కొనసాగడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *