అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిలను ప్రకటించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ

 వేదన్యూస్ వరంగల్:

తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలను ప్రకటించింది. ఇందులో భాగంగా వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పద్మశాలి కమ్యూనిటీకి చెందిన వెలిగేటి రవికుమార్‌ను నియమించింది.

ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు. పార్టీని ప్రజల్లో మరింత బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

తనకు వరంగల్ తూర్పు అసెంబ్లీ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *