వేదన్యూస్ తెలంగాణ :
రేషన్ కార్డుల ఈకేవైసీకి రేపటితో గడువు ముగియనుంది. అయితే ఇంకా చాలామంది దీన్ని పూర్తి చేయలేదు. అలాంటి వారి లిస్టు ఇప్పటికే రేషన్ షాపులకు చేరింది. ఈకేవైసీ చేసుకోకపోతే వచ్చే నెల నుంచి రేషన్ రాదని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. దీంతో పూర్తి చేయనివారు వెంటనే చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఈ గడువును మరికొన్ని రోజులు పొడిగిస్తారా లేదా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
