వేద న్యూస్, వరంగల్ క్రైమ్ :

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 22 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా కారణాలపై తక్షణమే అమల్లోకి వచ్చేలా ఈ బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీల్లో భాగంగా ఎస్. శ్రీనివాస్‌ను గణపురం ఎస్‌హెచ్‌ఓగా, జి. వేణును రఘునాథపల్లి సర్కిల్ సీఐగా, ఎ. శ్రీనివాస్‌ను వరంగల్ సీఎస్‌బీకి, పి. దేవేందర్‌ను నర్మెట్ట సర్కిల్ సీఐగా నియమించారు. అలాగే టి. రవి కుమార్‌ను వరంగల్ డబ్ల్యూపీఎస్-II ఎస్‌హెచ్‌ఓగా, ఎ. సువర్ణను వరంగల్ సీసీఎస్‌కు బదిలీ చేశారు. పి. మంగీలాల్‌ను టాస్క్‌ఫోర్స్‌కు, భరత్ సుమన్‌ను పాలకుర్తి సర్కిల్ సీఐగా, వి. జానకీ రామ్‌రెడ్డిని వరంగల్ సీఎస్‌బీకి, టి. కిరణ్‌ను పీసీఆర్‌కు పంపించారు. ఇక ఎ. ప్రవీణ్ కుమార్‌ను పర్కల్ ఎస్‌హెచ్‌ఓగా, వి. క్రాంతి కుమార్‌ను వరంగల్ టాస్క్‌ఫోర్స్‌కు, అనుముల శ్రీనివాస్‌ను ధర్మసాగర్ ఎస్‌హెచ్‌ఓగా, జి. బాబులాల్‌ను ఆత్మకూరు ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. ఆర్. సంతోష్‌ను పర్వతగిరి సర్కిల్ సీఐగా, బి. రాజగోపాల్‌ను టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేశారు. కె. శ్రీను ఎల్కతుర్తి సీఐగా, పి. రమేష్ హనుమకొండ డబ్ల్యూపీఎస్-I ఎస్‌హెచ్‌ఓగా, కె. సూర్య ప్రసాద్ సీటీసీ వరంగల్‌కు, కె. సాయి రమణను వరంగల్ సీఎస్‌బీకి బదిలీ చేశారు. వై. సంజీవరావును వర్ధన్నపేట సీఐగా, కె. శ్రీనివాసరావును వరంగల్ సీసీఆర్‌బీకి నియమించారు. బదిలీ అయిన అధికారులు వెంటనే రిలీవ్ అయి, కొత్త పోస్టింగ్‌లలో విధుల్లో చేరాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. సంబంధిత ఏసీపీలు ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *