వేద న్యూస్, హనుమకొండ ప్రతినిధి: హనుమకొండ సుబేదారి గణేష్ నగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన ఎంజాయ్ అండ్ మస్తీ ప్లే జోన్ ను నిర్వాహకులు మహమ్మద్ షాహేద్, మాజీ కార్పొరేటర్ మానస రాంప్రసాద్ పాల్గొని, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం రాంప్రసాద్ మాట్లాడుతూ పత్తిపిల్లలు, చిన్నపిల్లల కోసం తేజ కరమైన ఆట స్థలాల ద్వారా సంతోషకరమైన రేపటి వైపు అడుగులు వేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని అన్నారు. నిర్వాహకులు మహమ్మద్ షాహిబ్ మాట్లాడుతూ పిల్లలు ఆడండి నవ్వండి ఎదగండి ప్రతి బిడ్డ రాణించే ఒక ఆహ్లాదకరమైన, సురక్షితమైన, ఉత్సాహభరితమైన ఆట స్థలమని, అంతేకాకుండా సురక్షితమైన వాతావరణంలో పిల్లలు సృజనాత్మకత చలన నైపుణ్యాలు సామాజిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రారంభోత్సవ ఆఫర్ మొదటి మూడు రోజులు మాత్రమే గంటకు 99 రూపాయలు వర్తిస్తుందని ఈ అవకాశాన్ని త్రినగరి పసిపిల్లలు సద్వినియోగం చేసుకోవాలని వారి తల్లిదండ్రులు ద్వారా పిల్లల కోరికలు నెరవేర్చాలని అన్నారు. మా దగ్గర బాల్ పూల్, సాఫ్ట్ ప్లే, క్రాల్, టన్నెల్, స్టయిడ్ జోన్, ఇసుక ప్లే ఏరియా, క్రియేటివ్ ప్లే, సామాజిక నైపుణ్యాలు, అభ్యాస కార్యకలాపాలు, వినోదం, పుట్టినరోజు పార్టీలు, ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనాజ్, షకీర్, కుటుంబ సభ్యులు, అతిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *