•  ఫోర్ట్ రోడ్డు వరంగల్ బ్రాంచ్..

వేద న్యూస్, వరంగల్ టౌన్:

దేశంలోనే మూడో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు “యాక్సిస్ బ్యాంకు” తన నూతన శాఖను శుక్రవారం వరంగల్ పట్టణంలోని ఫోర్ట్ రోడ్డు లో ప్రారంభించింది. ఎన్డీఏ విశ్వనాథం అర్బన్ మాల్ ఫోర్టు రోడ్ గ్రౌండ్ ఫ్లోర్ లో యాక్సిస్ బ్యాంకు కార్యకలాపాలు షురూ అయ్యాయి. బ్యాంకు శాఖ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎన్ ఐ టీ వరంగల్ రిటైర్డ్ రిజిస్ట్రార్ పాశం వెంకటయ్య హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి బ్యాంకు సిబ్బంది, అధికారులు, వినియోగదారులు హాజరయ్యారు.

వినియోగదారులకు 24/7 అందుబాటులో ఉంటూ, అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా యాక్సిస్ బ్యాంకు వరంగల్ ఫోర్ట్ రోడ్డు శాఖ బ్రాంచ్ హెడ్ సజ్జనపు శ్రీధరాచారి తెలిపారు.

బ్యాంకు నూతన శాఖ ప్రారంభోత్సవంలో యాక్సిస్ బ్యాంకు క్లస్టర్ హెడ్ కృష్ణమోహన్, బ్రాంచ్ హెడ్ సజ్జనపు శ్రీధరాచారి, బ్రాంచ్ ఆపరేషన్స్ హెడ్ బి వినోద్ కుమార్ , బ్యాంకు సిబ్బంది, వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *