వేద న్యూస్, పాపన్నపేట
మండల పరిధిలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం పంపిణీ చేశారు. పాపన్నపేట ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన అల్పాహార పథకం కార్యక్రమాన్ని విద్యార్థులందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఉదయం ప్రతి ఒక్కరు పాఠశాలలో తినాలని ,ఆకలితో ఉండవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ గౌడ్, పాఠశాల చైర్మన్ భవాని, ప్రధానో పాధ్యాయులు మహేశ్వర్,మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్ ,మాజీ ఉప సర్పంచ్ ఖలీమ్ , ముశెట్టి కిష్టయ్య , శివయ్య ,సంగమేశ్వర్, శ్రీనివాస్ ,చోటు , రమేష్ ,ఉదయ్ , ప్రవీణ్ గౌడ్ , భూమయ్య ,పౌలు ,వినీష్ గౌడ్ హరీష్ ,శ్రీశైలం ,రాజు ,ఆంజనేయులు పాల్గొన్నారు.
