- ఐక్యతే బలం.. సమగ్రతే దేశానికి పునాది
ఏకతా నగర్ పరేడ్లో మెదక్ జిల్లా నుంచి 15 మంది
వేద న్యూస్ పాపన్నపేట
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతినిపురస్కరించుకుని ఈ నెల1నగుజరాత్లోని ఏకతానగర్లోనిర్వహించనున్న జాతీయ సమైక్యతా కార్యక్రమంలో మెదక్ జిల్లా నుంచి 15 మంది సభ్యులు పాల్గొననున్నారు. భాజపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా సభ్యులు గురువారం ఉదయం సికింద్రాబాద్ నుంచిగుజరాత్కుబయలుదేరారు.దేశ సమగ్రత, ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినసేవలనుస్మరించుకుంటూఈకార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే సభ్యులు పరేడ్లో పాల్గొని, భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అనే సందేశాన్నిచాటిచెప్పనున్నారు.ఈపరేడ్లోప్రధానమంత్రి నరేంద్రమోదీపాల్గొననుండటంతో కార్యక్రమానికి ప్రత్యేకప్రాధాన్యంసంతరించుకుంది.యువతలోదేశభక్తి,జాతీయసమైక్యత,సోదరభావాన్నిపెంపొందించడంతో పాటు సర్దార్ పటేల్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కార్యక్రమ ప్రధానఉద్దేశమనినిర్వాహకులు పేర్కొన్నారు.మెదక్ జిల్లా నుంచి 15 మంది సభ్యులుఈజాతీయస్థాయికార్యక్రమంలో పాల్గొనడం జిల్లాకుగర్వకారణంగానిలవనుంది. దేశ ఐక్యత, సమగ్రతనుప్రతిబింబించేపరేడ్లోభాగస్వాములవుతూ సర్దార్ పటేల్ స్ఫూర్తిని చాటేందుకు సభ్యులు సిద్ధమయ్యారు.