బాధిత కుటుంబానికి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆర్థిక సాయం
వేద న్యూస్ పాపన్నపేట
పాపన్నపేట మండల పరిధిలోని అబ్లాపూర్ గ్రామానికి చెందిన ముమ్మని బాలయ్య అకాల మరణం పట్ల బీఆర్ఎస్ నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు తన తరఫున రూ.5 వేల ఆర్థిక సాయాన్ని గ్రామ బీఆర్ఎస్ నాయకుల ద్వారా అందజేశారు.
ఈకార్యక్రమంలో అబ్లాపూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు కానాపురం లింగంగౌడ్,కొంపల్లి కిష్టయ్య,ముమ్మని బాగయ్య,ముమ్మని నర్సింలు,చాకలి కుమార్, షెగ్గారి నర్సింలు,షెగ్గారి రమేష్‌గౌడ్,సీతానగరం నరేష్,చీకోటి ఎల్లప్పతో పాటు పలువురు పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
