*ఎల్ -నినోపై విద్యార్థుల అవగాహన ర్యాలీ**
*అంగడిలో వినూత్న ప్రచారం!*
*నీరు, విద్యుత్ పొదుపుపై విద్యార్థుల చైతన్యం..*
*పాపన్నపేట అంగడిలో అవగాహన కార్యక్రమం*
వేద న్యూస్, పాపన్నపేట
మండల కేంద్రమైన పాపన్నపేట గ్రామంలోని బుధవారం నాడు వాతావరణ మార్పులు, ఎల్-నినో ప్రభావంపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పాపన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాలలోని ‘యూత్ అండ్ ఎకో క్లబ్’ ఆధ్వర్యంలో బుధవారం పాపన్నపేట వారపు అంగడిలో విద్యార్థులు విస్తృత అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు అంగడికి వచ్చిన ప్రజలు, వ్యాపారులను ఉద్దేశించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఎల్-నినో ప్రభావం వల్ల కలిగే వాతావరణ మార్పులు, కరువు పరిస్థితుల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల చొరవను స్థానికులు అభినందించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అంజాగౌడ్, మోహన్ రావు, రమేష్ తదితరులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు
