• బేకరీ నిర్వాకం దయనీయం.. శుభ్రత గాలికి.. అధికారులు దేనికి.?
  • ప్రజల ప్రాణాలకు భరోసా కరువు.. ఇదీ పరకాల పట్టణంలో ఓ బేకరీ తీరు!

వేద న్యూస్ , హనుమకొండ:

ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాల్సిన బాధ్యత కలిగిన బేకరీలు నిర్లక్ష్యానికి నిలయాలుగా మారుతున్నాయా? పరకాల పట్టణంలోని ఓ బేకరీలో పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

నిత్యం వందలాది మంది కొనుగోలు చేసే ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బేకరీలో ఆహార పదార్థాల తయారీ ప్రాంతం, నిల్వ చేసే ప్రదేశాలు, ఉపయోగించే ముడిసరుకుల విషయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సంబంధిత బేకరీలో అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తయారయ్యే ఆహార పదార్థాలను ప్రజలు కొనుగోలు చేసి తింటే వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అధికారుల పర్యవేక్షణ ఏది?

ఆహార భద్రత ప్రమాణాలు పాటించని వ్యాపార సంస్థలపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజారోగ్యానికి సంబంధించిన ఇలాంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బేకరీలో తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రజారోగ్యంతో చెలగాటం వద్దు!

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బేకరీలో ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల తీరును పరిశీలించాలని, నిబంధనల ఉల్లంఘన ఉంటే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *