జేసిఐ ఇండియా ఫౌండేషన్ స్కాలర్ షిప్స్ కు ఎంపికైన నాగ్సన్ పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు

వేద న్యూస్, పాపన్నపేట రిపోర్టర్ దయానంద్

2026 సంవత్సరానికి గాను జెసిఐ ఇండియా ఫౌండేషన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లో భాగముగా జెసిఐ హైదరాబాద్ ఛాంపియన్ విభాగంలో మెదక్ జిల్లా,పాపన్నపేట మండల పరిధిలోని నాగ్సన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు గోకని భార్గవి,రియాజ్ లు ఎంపికయ్యారని జెసిఐ హైదరాబాద్ ఛాంపియన్ మేనేజర్ కిషోర్ కుమార్ మంగళవారం రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్ టైమ్ స్కాలర్షిప్ కింద సంవత్సరానికి రూ.3000 రూపాయలు నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమ చేయబడతాయనీ,ఈ స్కాలర్షిప్ అనేది ఉత్తమ ప్రతిమ కనబరిచిన అనాధ పిల్లలు లేదా సింగిల్ పేరెంట్ గల పిల్లలకి అందించడం జరుగుతుందన్నారు. ప్రతిభ గల ఎంపికైన విద్యార్థులు మరింత పట్టుదలతో చదివి ఉజ్వల భవిష్యత్తును పొందాలని కిషోర్ కుమార్ తెలిపారు.ఈ సంవత్సరమే కాకుండా గత మూడు సంవత్సరాల నుండి నాగసాన్ పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందిస్తున్నందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజీరుద్దీన్,ఉపాధ్యాయులు బి.అశోక్ కుమార్ జెసిఐ ఫౌండేషన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *