వేద న్యూస్, చిల్పూర్ : హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని బీజేపీ చిల్పూర్ మండల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బీజేపీ చిల్పూర్ మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్, జిల్లా నాయకుడు బాల్నే శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిర్బంధించిన గంటె ఉపేందర్ యాదవ్, బాల్నే శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
