*మెదక్ జిల్లా దూదేకుల సంఘం అధ్యక్షుడిగా సద్దాంహుస్సేన్ నియామకం*

వేద న్యూస్ పాపన్నపేట

మెదక్ జిల్లా దూదేకుల సంఘం నూతన అధ్యక్షుడిగా పాపన్నపేట మండల కేంద్రానికి చెందిన దూదేకుల సద్దాంహుస్సేన్ నియమితులయ్యారు. ఈ మేరకు దూదేకుల నూర్ బాషా సంఘం జాతీయ అధ్యక్షుడు షేక్ సత్తార్ సాహెబ్ శుక్రవారం ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సద్దాంహుస్సేన్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జాతీయ అధ్యక్షుడు షేక్ సత్తార్ సాహెబ్‌కు, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దూదేకుల సామాజిక వర్గ అభివృద్ధికి, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అందరినీ కలుపుకుని సంఘం బలోపేతానికి పనిచేస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *