జర్నలిస్టుల సంక్షేమ సారథి డా. జితేందర్ రావుకు జ్యోతిరావు ఫూలే సేవా పురస్కారం

రవీంద్రభారతిలో ఘనంగా పురస్కార ప్రదానం.. డా. జితేందర్ రావు సేవలకు అరుదైన గౌరవం

వేద న్యూస్, పాపన్నపేట

జర్నలిస్టుల సంక్షేమం, ఐక్యత మరియు వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం అలుపెరగని కృషి చేస్తున్న సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీవైజేఎఫ్) అధ్యక్షుడు డా. జితేందర్ రావు తనుగులకు ప్రతిష్టాత్మక ‘మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆత్మీయ సేవా పురస్కారం–2026’ లభించింది.
ఆమని శ్రుతి లయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనమండలి మాజీ చైర్మన్ శ్రీ సిరికొండ మధుసూదనాచారి సమక్షంలో, రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్. కృష్ణయ్య చేతుల మీదుగా డా. జితేందర్ రావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. యువ జర్నలిస్టులను ప్రోత్సహించడంతో పాటు మీడియా అక్రిడిటేషన్లు, జర్నలిస్టుల ఆరోగ్య భద్రత మరియు సంక్షేమం కోసం డా. జితేందర్ రావు చేస్తున్న నిరంతర సేవలను కొనియాడారు. ఆయన సేవలకు ఈ పురస్కారం సరైన గుర్తింపు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, పోలీస్ హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, మాజీ ఆర్టీఐ కమిషనర్ కె. విజయ్ బాబు తదితర ప్రముఖులు పాల్గొని డా. జితేందర్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *