వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారిని ఆదుకుంటూ..కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేశ్ తంగళ్లపల్లి తన వంతు సాయం చేస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి మండలం చింతలపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అడ్డూరి రమేష్, కాంగ్రెస్ సోషల్ మీడియా మండల అధ్యక్షులు చిలుముల వినోద్ కుమార్ కోరిక మేరకు చింతలపల్లి గ్రామంలోని నిరుపేదైన బొంకూరి సురేష్-సంధ్యల కూతురు నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ కోసం రమేశ్ తన వంతుగా 50 కిలోల బియ్యంతో పాటు ఆర్థిక సహాయం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తంగెళ్లపల్లి రమేష్ ను గ్రామస్తులు అభినందించారు. రమేశ్ మాట్లాడుతూ ఎల్లవేళలా మండలంలోని ప్రతీ ఒక్క పేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఎలాంటి కష్టమొచ్చిన ఎల్లవేళలా సంప్రదించొచ్చని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గొర్రె మహేందర్, బాలస్వామి, చందు, మహేష్, రాకేష్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.