వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటే క్రమంలో అయోధ్య స్పెషల్ ట్రైన్ ఢీకొని ..గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మంగళవారం ఉదయం గుర్తు తెలియని వృద్ధుడు వయస్సు (సుమారు 60-65 సంవత్సరాలు) జమ్మికుంట రైల్వే స్టేషన్ లో రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అయోధ్య స్పెషల్ ట్రైన్ ఢీ కొని చనిపోయారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు.
మృతుడు తెలుపు ఫుల్ షర్ట్.. దానిపై నలుపు లైట్ బ్రౌన్ రంగు నిలువు గీతల డిజైన్ కలదు, బ్లూ గీతల లుంగీ ధరించి ఉన్నారు. మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ జమ్మికుంట మార్చురీ రూములో భద్రపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏమైనా వివరాలు తెలిసినచో ఫొన్ నంబర్లు 99493 04574, 87126 58604 కి తెలపాలని సూచించారు.