వేద న్యూస్, వరంగల్:
నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నెక్కొండ మండలం గొల్లపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సీసీ రోడ్డు పనులను ఎస్ డి ఎఫ్ స్పెషల్ డెవలప్ మెంట్ నిధులతో చేపడుతున్నట్లు రంజిత్ రెడ్డి తెలిపారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోందని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ ప్రజలకు అందుతున్నాయని, ‘ప్రజా పాలన’లో ప్రజలకు అంతా మంచే జరుగుతున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బక్కీ అశోక్ , పట్టణ పార్టీ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండి శివకుమార్, నాయకులు కుసుమ చెన్నకేశవులు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రావుల మహిపాల్ రెడ్డి , జిల్లా నాయకులు బక్కి నరేష్, బిర్రు ప్రభాకర్, శంకరయ్య, మధుకర్ , బిర్రు వినయ్ , చరణ్ ,కాసాని రాకేష్ , అప్పం ప్రసాద్ గ్రామ మహిళా కాంగ్రెస్ నాయకురాలు మల్లాడి హైమాప్రజలు తదితరులు పాల్గొన్నారు.