- వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం
- కొనుగోలు చేసిన ప్రతీ వస్తువుకు రశీదు తప్పనిసరి
- కరీంనగర్ జిల్లా వినియోగదారుల మండలి బాధ్యులు బెల్లి రాజయ్య
- వినియోగదారుల హక్కులపై జనానికి అవగాహన లేదు: కాలేజీ ప్రిన్సిపాల్ రాజశేఖర్
వేద న్యూస్, జమ్మికుంట:
ప్రపంచ మానవ వినియోగదారుల హక్కుల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ డి. రాజశేఖర్ అధ్యక్షత వహించగా కరీంనగర్ జిల్లా వినియోగదారుల మండలి బాధ్యులు బెల్లి రాజయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రతి వస్తువు కొనుగోలు చేసినప్పుడు రశీదు తప్పనిసరిగా తీసుకుని దానిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు. వస్తువు నాణ్యత సరిగా లేకున్నా, కల్తీ వస్తువు అయితే, వినియోగించే తేదీ ముగిసినా మనకు అన్యాయం జరిగిందని భావిస్తే జిల్లా, రాష్ట్ర, కేంద్రస్థాయిలో వినియోగదారుల హక్కుల ఫోరానికి వెళ్లి ఫిర్యాదు చేస్తే తగిన ప్రతిఫలాన్ని పొందే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రజలకు వినియోగదారుల హక్కుల గురించి సరైన అవగాహన లేదని చెప్పారు. వినియోగదారుల హక్కుల గురించి సరైన అవగాహన ఏర్పరచుకుని ఉంటే మోసపోయినప్పుడు తగిన న్యాయం పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
వాణిజ్యశాస్త్ర విభాగ అధిపతి బల్మూరి మహేందర్ రావు మాట్లాడుతూ ఒప్పందాలలో చట్టబద్ధత ఉన్నప్పుడే వాటిని నేస్తమాల ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుందని, చట్టబద్ధతలేని వాటికి ఎలాంటి హక్కులు ఉండవని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎడమ శ్రీనివాస్ రెడ్డి, స్టాఫ్ సెక్రటరీ డాక్టర్ ముక్కెర రామ మోహన్ రావు, అధ్యాపకులు రేణ ఈశ్వరయ్య, వి.స్వరూప రాణి, డాక్టర్ పి. రవి ప్రకాష్ రావు, డాక్టర్ ఎంబడి రవి, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ ,డాక్టర్ సుష్మ, మమత, ప్రశాంత్ ,అరుణ్ రాజ్, శ్రీనివాస్ సాయి కిరణ్ ,రమేష్, అనూష విద్యార్థులు పాల్గొన్నారు.