వేద న్యూస్, వరంగల్:

తమతో పాటు చదువుకున్న స్నేహితుడి కుటుంబానికి ఆపదలో అండగా నిలిచారు 1994 95 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు. హనుమకొండ జిల్లా దామర మండల కేంద్రానికి చెందిన రఘు అనివార్య కారణాలతో ఇటీవల మృతి చెందారు.

విషయం తెలుసుకున్న 1994-95 ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు .. తమ స్నేహితుడు రఘు కుటుంబానికి అండగా నిలవడానికి ముందుకు వచ్చారు. మిత్రులందరూ..కలిసి.. శనివారం రఘు కుటుంబ సభ్యులకు..  టెన్త్ బ్యాచ్ తరఫున మొత్తం రూ. 86,500 అందజేసి.. మిత్రుని కుటుంబానికి మనో ధైర్యం ఇచ్చారు. కష్ట కాలంలో స్నేహితుడి కుటుంబానికి తోచిన సాయం చేసి అండగా నిలిచిన విద్యార్థులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో మోహన్, శ్రీనివాస్, కుమారస్వామి, శివకుమార్ , నగేష్ , సుజయ్ ,రవి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.