వేద న్యూస్, మరిపెడ:

మరిపెడ ఉన్నత పాఠశాలలో  పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగు వారి పెద్ద పండుగ అయిన సంక్రాంతి వేడుకలు ముందస్తు గా ఘనంగా జరిగాయి. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పాఠశాల ఆటస్థలంలో గాలిపటాల పోటీలు నిర్వహించారు. తదుపరి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.

విద్యార్థినీ విద్యార్థులు రకరకాల పూలతో, గొబ్బెమ్మలతో, పలు రకాల రంగులతో రంగవల్లులు వేశారు. తదుపరి భోగి మంటలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ బయగాని రామ్మోహన్, ఉపాధ్యాయులు జనార్ధనా చారి, దేవుల, శ్రీశైలం, నెహ్రూ, స్వప్న, ప్రకాష్, శౌరి, రమేష్ రెడ్డి, లెనిన్, ప్రసాదరావు, సారయ్య, జహేదా బేగం, సురేష్, బాబురావు, అనిత, రాజకుమారి, మంజుశ్రీ మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.