వేద న్యూస్, వరంగల్:
నెక్కొండ లోని స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంకాగాంధీ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి ఈ వేడులకు హాజరై కేక్ కట్ చేసి .. ప్రియాంకా గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షులు జై లక్ష్మణ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సింగం ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అన్వర్,బొడ్డుపల్లి యాదగిరి,చెన్న రెడ్డి,ఉప్పల లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ముద్రబోయిన శ్రీకాంత్, ,కొమ్ము కార్తిక్,కోర లక్ష్మణ్,వీరన్న మలోత్ సూర్య,మహమ్మద్ అఫ్జల్,మహమ్మద్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.