• తొమ్మిదేళ్లుగా  చెన్నకేశవ స్వామి వారి ఆలయంలోఅన్న ప్రసాదం అందజేస్తున్న దుబ్బాసి మానస- నవీన్ దంపతులు
  •  స్వామి వారి కల్యాణ మహోత్సవం సందర్భంగా..

వేద న్యూస్, వరంగల్:

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో దుబ్బాసి మానస నవీన్ దంపతులు శనివారం అన్నదానం నిర్వహించారు. శ్రీ దేవి-భూదేవి సమేత చెన్న కేశవ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది.

శనివారం ఈ ఉత్సవానికి హాజరయిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు అన్నదాన దాతలు దుబ్బాసి మానస నవీన్ గురు వెల్లడించారు.
కన్నుల పండుగగా జరిగినచెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవంలో ప్రజల అధిక సంఖ్యలో ..సకుటుంబ సపరివారం సమేతముగా విచ్చేసి, స్వామివారి ఆశీర్వచనములు తీర్థ ప్రసాదములు స్వీకరించినట్టు పేర్కొన్నారు.

స్వామివారి సేవలో భాగంగా గత తొమ్మిదేళ్లుగా దుబ్బాసి మానస నవీన్ అన్న ప్రసాదం అందిస్తుండటం పట్ల భక్తులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. అన్నదానం అన్ని దానాల్లో కెల్లా గొప్పదానమని, అందులో పవిత్రమైన ఆలయంలో స్వామివారి సన్నిధిలో భక్తులకు అన్నప్రసాదం అందించడం గొప్ప విషయం అని పలువురు తెలిపారు.