వేద న్యూస్, వరంగల్:

ఎస్ఈఈఈపీసీ సర్వే(టీజీ-తెలంగాణ- సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే) కు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పని చేసిన తమకు డబ్బులు చెల్లించాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పని చేసిన సాధ్విక్, కార్తీక్, మానస, శ్రావణి, అశ్వినిలు కోరారు. 3 నెలలుగా తాము ఆ డబ్బుల కోసం వేచి చూస్తున్నామని తెలిపారు.  చేసిన పనికి సంబంధించిన డబ్బులు ఇప్పించాలని కోరుతూ సోమవారం ఎంపీడీవో ఆఫీసులో ఎంపీడీవో కల్పనకు వారు వినతి పత్రం సమర్పించారు. 

ఎలాంటి జాప్యం లేకుండా వీలైనంత తొందరగా డబ్బులు మంజూరు  చేయాలని విన్నవించారు.  ఇతర మండలాల్లో పని చేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు డబ్బులు అందాయని, కానీ, తమకు ఇంకా రాలేదని పేర్కొన్నారు. దయచేసి వీలైనంత త్వరగా తమకు డబ్బులు ఇప్పించాలని ఎంపీడీవోను డేటా ఎంట్రీ ఆపరేటర్లు అభ్యర్థించారు.