వేద న్యూస్, కరీంనగర్:
ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లతో పాటు అన్ని రకాల ఉద్యోగ ఫలితాలను ప్రభుత్వం నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్న 3వ రోజు ఎమ్మార్పీఎస్ నిరసన దీక్షలకు జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి హాజరై సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
శుక్రవారం హుజురాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఎస్సీల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చాలని వాసు వడ్లూరి డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రం మాదిగ, మారేపల్లి శ్రీనివాస్, ఎం ఎస్ పి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తడకమళ్ళ శేఖర్, శనిగరపు భాస్కర్, మేకల మొగిలయ్య, మారముల కిరణ్, రొంటల రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.