వేద న్యూస్, ఎల్కతుర్తి:

ఎల్కతుర్తి మండల పరిధిలోని  దామెర గ్రామ యువకులు బీజే పీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ఆ ధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు.

యువకులకు కేంద్ర సహాయ మంత్రి.. కాషాయకండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటి రెడ్డి రాంగోపాల్ రెడ్డి, రాష్ట కౌన్సిల్ సభ్యులు లక్కీ రెడ్డి తిరుమల రెడ్డి, నాయకులు ఆడెపు శ్రీ వర్ధన్ , పోలు నరేష్, చదిరం రాకేష్ , బొక్కలపాటి కుమారస్వామి, మంతుర్తి తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు