వేదన్యూస్ – ఢిల్లీ
హెచ్‌సీయూ భూముల వేలం వివాదంపై ఢిల్లీలో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే. అరుణ స్పందించారు. మీడియాతో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన హెచ్‌సీయూ భూముల వేలాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. మిస్టర్ రేవంత్ రెడ్డి ఎవరికోసం ఈ భూములను వేలం వేస్తున్నావ్..? అంటూ ప్రశ్నించారు.
నీకున్న మొండి వైఖరి వీడిచిపెట్టు, హెచ్‌సీయూ భూముల వేలాన్ని వెంటనే ఆపేయ్. రేవంత్ సర్కార్ కు ఎంపీ డీకే.ఆరుణ అల్టిమేటం జారీ చేశారు. గతంలో భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన రేవంత్.. ఇవాళ ఆయనే స్వయంగా HCU భూములను ఎందుకు అమ్ముకునాలనుకుంటున్నారో సమాధానం చెప్పాలి? అని అన్నారు.
ఓ విద్యాసంస్థకు చెందిన భూములను మీ స్వార్థం కోసం అమ్ముకుంటారా..?. విద్యార్థులు వ్యతిరేకిస్తున్నా ఎందుకీ మొండి వైఖరి ఎవరి కోసం ఈ వేలంపాటు..?. ఈ భూముల వేలం వద్దంటూ హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనల చేస్తున్నా.. పోలీసు నీడలో ఎందుకు వేలం వేయాలనుకుంటున్నారు?. అసలు మీ పంతం ఏంటి..?. ప్రజల కోసం కాదు మీ సొంత లాభం కోసం భూములను వేలం వేస్తున్నారు..? అని అంటూ రేవంత్ సర్కార్ కు ఎంపీ డీకే అరుణ సూటి ప్రశ్నలు సంధించారు.
ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే దమ్ము లేకే భూముల అమ్మకాలకు పాల్పడుతున్నారు. అలవి కానీ హామీలతో… మోసపూరిత వాగ్దానాలతో ఇప్పటికే ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కారు.. అధికారంలో ఉన్నాం కదా అని అహంకారంతో ఏది పడితే అదిచేస్తే ఊరుకోము. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. స్వలాభం కోసమే… ఏ రహస్య ఒప్పంధంతో హెచ్‌సీయూ భూములను వేలం వేస్తున్నావ్. ఈ భూముల వేలం తెలంగాణ ప్రజల కోసం కాదు, దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు..విద్యార్థులంతా ఈ భూముల వేలాన్ని వద్దని అడ్డుకుంటుంటే.. రేవంత్ రెడ్డి పట్టుబట్టడం వెనుక మతలబు ఏంటి..? .ఇప్పటికే పథకాల అమలు పేరుతో రాష్ట్ర భవిష్యత్తును అంథకారంలోకి నెట్టారు. అదే అన్నావాయితిని కొనసాగిస్తామంటే ఊరుకోము. ఈ భూముల వేలాన్ని వద్దంటున్న ప్రజల, విద్యార్థుల అభిష్టాన్ని ప్రభుత్వం గౌరవించాలి అని సూచించారు.