వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి :

కేతపల్లి మండలం లోని భీమవరం గ్రామంలో ఆదివారం శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. పురోహితుల ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ సీతారాముని కళ్యాణం కమనీయంగా రమనీయంగా నిర్వహించారు. కళ్యాణం సందర్భంగా ప్రజా ప్రతినిధులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ వేడుకలో పాల్గొని జిల్లా ప్రజలందరికీ సీతారాముల స్వామి వారి అనుగ్రహం ఉండాలని వేడుకున్నారు. అనంతరం భక్తులకు ఉత్సవ కమిటీ వారు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.

పురోహితులు నందిగామ అరవింద శాస్త్రి నందిగామ సీతారామశాస్త్రి, కళ్యాణం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ బొల్ల వెంకట్ రెడ్డి, కేతపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంపసాటి శ్రీనివాస్ యాదవ్, గ్రామ మాజీ సర్పంచ్ బడుగుల నరేందర్ యాదవ్, మాజీ ఎంపీపీ పేరుమల్ల శేఖర్, గ్రామ శాఖ అధ్యక్షులు నోముల రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంపసాటి కృష్ణయ్య, చిమ్ముట కిష్టయ్య, బడుగుల చంద్రశేఖర్ యాదవ్, గొల్ల అనిల్, కంపసాటి శ్రవణ్, అర్వ కిరణ్, ఆవుదొడ్డి ప్రవీణ్, గడ్డం నరేష్, జిల్లాల యాదగిరి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.