వేద న్యూస్, వేములవాడ ప్రతినిధి :

దక్షిణ కాశీగా పిలవబడుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతా రాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, సెస్ డైరెక్టర్ నామాల ఉమా, మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు, మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి స్వామి వారికి ఆలయ ఈవో వినోద్ తో కలిసి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం భక్తులతో కలిసి రాములవారి కళ్యాణ వేడుక తిలకించారు.

రాములవారి కళ్యాణం చూసేందుకు వచ్చిన శివపార్వతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాములవారి కళ్యాణం చూసేందుకు అశేష భక్త జనులు కదలి వచ్చారు.