వేద న్యూస్,దామరచర్ల :

దామరచర్ల మండల కేంద్రంలోని శ్రీ శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు మరియు భక్తజన సందోహంతో దేవాలయం కిక్కిరిసిపోయింది. నూతన రాములవారి ఆలయంతో పాటు పాత రామాలయంలో కూడా కళ్యాణం నిర్వహించడం జరిగింది.భక్తులు సీతారాముల కళ్యాణాన్ని ఎంతో భక్తితో వీక్షించి ఆనందించారు.సీతారాముల కళ్యాణం కు వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆలయ కమిటీ వారు మంచి సౌకర్య,సదుపాయాలు కల్పించడం జరిగింది.

ఇలాంటి భక్తి పూర్వక వాతావరణాన్ని మరియు సౌకర్యాలను కల్పించినందుకు ఆలయ కమిటీకి భక్తులు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు,పలువురు నాయకులు పాల్గొన్నారు.