వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి:
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం ఇస్కభావిగూడెంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండగగా నిర్వహించారు.శ్రీసీతారామ చంద్ర స్వామి దేవస్థానంలో సీతారాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపారు. పురోహితులు బారువాది మహేష్ శర్మ ఆధ్వర్యంలో రామునికి ఒడుగు ధరించి వేదమంత్రాలు నడుమ సీతారాముని కళ్యాణం కమనీయంగా రమణీయంగా నిర్వహించారు.గ్రామ పంచాయితీ తాజా మాజీ సర్పంచ్ నిమ్మల గోవిందమ్మ కుమార్తె కేతనపల్లి రేణుక-యల్లారెడ్డి దంపతులు సీతారామునికి పట్టు వస్త్రములు పుస్తే మెట్టెలు పూజ సామాగ్రి సమర్పించాగా,పాలుట్ల బాబయ్య-సునీత, తంగేళ్ల సీతారాంరెడ్డి-లలిత, మొల్లాల శ్రీనివాస్ రెడ్ది-వినోద దంపతులు పెండ్లి పిఠాలపై కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించారు.కళ్యాణం అనంతరం గ్రామస్తులు భక్తులకు పులిహోర ప్రసాదం బెల్లం మిర్యాల తో తయారు చేసిన ద్రవాన్ని భక్తులు స్వీకరించారు.

సీతారాముని కళ్యాణం సందర్భంగా గ్రామ ప్రజలు, పెద్ద ఎత్తున దేవాలయానికి కుటుంబ సమేతంగా తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.సాయంత్రం డిజే చప్పుడు కోలాటం భజన బృందాల నృత్యలనడుమ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వాముల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి గ్రామంఊరేగింపు శోభయాత్ర ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పురప్రముఖులు నిమ్మల నవీన్ రెడ్డి,పాలుట్ల బాబయ్య, కల్లూరి వెంకట్ రెడ్ది,జెర్రిపోతు ల రాములుగౌడ్,మంచికంటి నాగిరెడ్డి, మొల్లాల కృష్ణారెడ్డి, కట్టా ఆనంతారెడ్డి, పోతురాజు శ్రీనివాస్, తదితరులు మాట్లాడుతూ సీతారాముని పవిత్ర బంధాన్ని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఉమ్మడి తోపుచర్ల గ్రామ పంచాయతీ ప్రజలకు సీతరాముని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.