Big shock for Mohan Babu...!

వేదన్యూస్ – ఎల్బీనగర్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ నటుడు.. డైలాగ్ కింగ్ మంచు మోహాన్ బాబుకు ఎల్బీ నగర్ కోర్టు బిగ్ షాకిచ్చింది. గతంలో తన తనయుడు.. ప్రముఖ యువహీరో మంచు మనోజ్ కుమార్  జల్ పల్లిలోని తన ఇంటికి రాకుండా చర్యలు తీసుకోవాలి.

ఎలాంటి విధ్వంసం సృష్టించకుండా ఇప్పటికే అనేక ఇబ్బందులకు గురి చేసిన మనోజ్ కుమార్ ను తన ఇంటివైపు రాకుండా ఆదేశాలు ఇవ్వాలని గతంలో మోహాన్ బాబు పిటిషన్ వేశారు. అప్పట్లో మోహాన్ బాబుకు సానుకూలంగా.. హీరో మనోజ్ కు వ్యతిరేకంగా కోర్టు తీర్పునిచ్చింది.

తాజాగా మోహాన్ బాబు ఆరోపించినవన్నీ సత్యదూరమైనవి. అవన్నీ నిరాధారమైన ఆరోపణలు అని సరైన ఆధారాలను మనోజ్ కోర్టుకు సమర్పించారు. దీంతో విచారించిన ఎల్బీ నగర్ కోర్టు మోహాన్ బాబుకు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టేసింది. అక్కడితో ఆగకుండా తప్పిదంకు పాల్పడిన  కోర్టు క్లర్క్ కు కోర్టు మోమో జారీ చేసింది.