వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి కుమార్ ను దళిత రత్న అవార్డు వరించింది. ఆయన జీవితం అనేక దళిత విప్లవోద్యమాలతో ముడిపడి ఉంది. గతంలో అనేక ఉద్యమాలలో పాల్గొని, మాదిగ వర్గీకరణ కోసం నిరంతరం అలుపెరుగని పోరాటం చేశారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు మాదిగ, జాన్ను కనకరాజు మాదిగచేతుల మీదుగా సికింద్రాబాద్ సెంట్రల్ ఫంక్షన్ హాల్ లో దళిత రత్న అవార్డు ప్రదానం చేశారు. ఉద్యమాల హుజురాబాద్ గడ్డకు మరోసారి దక్కిన అరుదైన గౌరవం ఇది అని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.

దళిత రత్న అవార్డు గ్రహీత పుల్లూరికుమార్ మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం
తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. దళితుల జనాభా పెరిగినందున రిజర్వేషన్ పెరుగుదలకు భవిష్యత్తులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపించిన మార్గంలో మరిన్ని పోరాటాలు చేసి
విద్య ఉద్యోగ ఉపాధి రంగాలలో దళితుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు.

తెలంగాణ మాదిగ హక్కుల దండోరా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కుమార్ కు ఈ అవార్డు వరించడం పట్ల గ్రామస్తులు, శ్రేయోభిలాషులు సంతోషం వ్యక్తం చేశారు