వేద న్యూస్, వరంగల్:
OWLS(ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ), తెలంగాణ ప్రభుత్వం అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో మే 22న(గురువారం) నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పాకాల బయోడైవర్సిటీ పార్క్‌లో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఓల్స్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ప్రకృతి సమతుల్యత, సస్టెయినెబుల్(స్థిరమైన) అభివృద్ధి “Harmony with Nature and Sustainable Development” థీమ్‌తో డేను కండక్ట్ చేయనున్నట్టు వివరించారు.
గురువారం ఉదయం 6 గంటలకు పాకాల బయోడైవర్సిటీ పార్క్ వద్ద అందరూ కలుసుకుని.. 6. 30 గంటలకు నేచర్ వాక్కు వెళ్తారు. 9.30 గంటలకు చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరినా వద్ద బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు టీ తాగేందుకు బ్రేక్ ఉంటుంది. 10 గంటలకు డీఎఫ్‌వో(జిల్లా అటవీశాఖ అధికారి) పరకాల అంజు అగర్వాల్, ఎఫ్ఆర్వో పరకాల రవి కిరణ్.. ‘అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం’ సందర్భంగా సందేశం ఇస్తారు.
10.15 గంటలకు ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే గురించి బయోసైంటిస్ట్ హైదరాబాద్ హుస్సేన్ ప్రత్యేక అతిథిగా హాజరై వివరిస్తారు. అనంతరం ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ జాయింట్ సెక్రెటరీ పిట్టల రవిబాబు పిక్చర్ ప్రజెంటేషన్ ఇస్తారు. 11 గంటలకు సందర్శకులందరూ కలిసి బట్టర్ ఫ్లై పార్క్‌ను విజిట్ చేయనున్నారు. 11.30 గంటలకు ఆసక్తి ఉన్నవారు బోటింగ్ చేయొచ్చు.

మధ్యాహ్నం 12 గంటలకు ప్రోగ్రామ్ ముగియనుంది. అలా ప్రకృతితో మమేకమై జీవ వైవిధ్యం, పర్యావరణంతో పాటు పలు విషయాలను తెలుసుకునేందుకు మే 22న అన్ని వయసుల వారు ఈ ప్రోగ్రామ్‌కు అటెండ్ కావచ్చని, ఈ కార్యక్రమంలో ఉచితంగానే పాల్గొనవచ్చని, ఆసక్తి గల వారు 99855 49900 నంబర్లో సంప్రదించొచ్చని ఓల్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.